శ్రీ గాయత్రిలో ఎన్నికలు…!
– హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కు ఓటింగ్
– ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు
కోడంగల్, దర్శిని ప్రతినిధి : కొడంగల్ పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన ఓటింగ్ లో స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు.

పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం 9, 10వ తరగతి అమ్మాయిలు, అబ్బాయిలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో పాఠశాలకు చెందిన 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో విద్యార్థులు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఓటు వేశారు. ఈ ఎన్నికల ఫలితాలను ఈనెల 21న వెల్లడిస్తామని పాఠశాల కరెస్పాండంట్ రాము తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించడంలో భాగంగా పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఇస్మాయిల్, సమీనా, సరిత, ఉష, మహేశ్వరి, శ్రవంతి, సరిత, శంకుంతల, రాధికా, వంశీ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

