తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి

జాతీయం తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి
– బీజేపీతోనే బీసీలకు ముఖ్యమంత్రి పీఠం
– తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే జనసేన పోరాటం
– బీజేపీ జనసేన అభ్యర్థుల గెలుపుకు సైనికులు అవ్వాలి
– జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు
– తాండూరులో రోడ్ షో, సభ సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత పదేళ్ల పాలనలో ఎలాంటి అద్భుతాలు జరగలేదని, ఉద్యను స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన కొనసాగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ, జనసేన పోత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేమూరి శంకర్ గౌడ్ తరుపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జనసేన రోడ్ షో. బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అద్యంతం పవన్ కళ్యాణ ప్రసంగం ఉద్వేగ భరితంగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితోనే జనసేన పార్టీ ఉద్భవించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రాలో రౌడీలతో పోరు సలుపుతున్నామన్నారు.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన. జలయజ్ఞంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవినీతి ప్రారంభమయ్యిందన్నారు. శ్రీశైలం అడవుల్లో యురేనియం తవ్వకాలపై యువకుడు చేసిన పోరాటానికి అఖిలపక్షంలో జనసేన కూడా మద్దతు ఇచ్చిందని, అందుకే అప్పుడు తవ్వకాలను నిలివేయడం జరిగిందన్నరు. తెలంగాణలో గత పాలకులు చేసిన తప్పులే ఇప్పుడు పాలకులు చేస్తున్నారని విమర్శించారు. నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన యువత రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై తిరగబడాలన్నారు. నిప్పులు చెరుగుతూ చైతన్యంతో ముందుకు సాగాలన్నారు. ఉద్యమ కారుడు స్వర్గీయ గద్దర్ తో కూడా ఇదే విషయంలో చర్చించుకున్నామని గుర్తుచేశారు. బండెన బండి కట్టి.. ఏ బండెనక పోతావురో నైజాం సర్కారోడా అనే గీతాలతో గద్దర్ పై గౌరవం పెరింగిందన్నారు.

ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో జనసేన ముందుకు సాగుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని, బీసీలు, దళితులు రాజ్యాలు ఏలాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుందని బీజేపీ పార్టీకి జనసేవ పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. బీజేపీతోనే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం వస్తుందని అన్నారు. తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి సమర్థుడైన నాయకుడని అభివర్ణించారు.

బీసీలతో పాటు దళితుల సంక్షేమానికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగకు మద్దతు ఇచ్చారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు చేసుకున్న జనసేన అభ్యర్థుల గెలుపుకు అందరు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్. నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు పటేల్ జయశ్రీ, యు.రమేష్ కుమార్, జనసేన నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!