శ్రీ నేతాజీలో బోనాల జాతర..!
– స్కూల్లో స్పెషల్ సంబరాలు అదుర్స్
– ఆకట్టుకున్న విద్యార్థుల వేషాధారణలు
– బోనాలతో మొక్కులు తీసుకున్న విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరుపుకున్నారు. శనివారం స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలల ఆధ్వర్యంలో పాఠశాలలో ఈ స్పెషల్ సెలబ్రేషన్స్ అదుర్స్ అనిపించాయి. బోనాల జాతర వేడుకలలో భాగంగా స్కూల్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పాఠశాల విద్యార్థులు బోనాలతో ఊరేగింపుగా వచ్చారు.

బాలురు పోతురాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. డిల్లం.. బల్లెం.. అంటూ, వారం.. వారం.. నాడు.. అంటూ.., సత్తులు ఉన్నారు… సాయి తొట్ల అంటూ గీతాలతో మార్మోగించారు. అమ్మవారికి బోనం నైవేధ్యంగా సమర్పించి విద్యార్థులు మొక్కులు తీర్చుకున్నారు. ఆషాడం బోనాల ఉత్సవాలతో విద్యార్థులు సందడి చేశారు.

ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలలు మాట్లాడుతూ చిన్నారులకు ఆషాడ బోనాల విశిష్టతను తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాల విలువలను పెంపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

