జిల్లాలో ఎస్‌ఐలకు స్థాన చలనం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాలో ఎస్‌ఐలకు స్థాన చలనం..!
– ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
– ఎవరిని.. ఎక్కడికి బదిలీ చేశారంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని ఎస్‌ఐలకు భారీ సంఖ్యలో స్థాన చలనం కల్పించారు. ఈ మేరకు డీఐజీ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలోని 35 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. అయితే జిల్లాలో జరిగిన బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

వికారాబాద్, ధారూర్, నవాబ్ పేట్, దుద్యాల, కోడంగల్, తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, కరణ్‌ కోట్, యాలాల, పరిగి, మర్పల్లి, బొంరాస్ పేట్ పోలీస్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలను బదిలీ చేశారు.

ఇందులో ఒకరిని దుద్యాలకు అటాచ్ చేశారు. బదిలీ చేసిన ఎస్ఐల స్థానాలలో వెయిటింగ్‌లో ఉన్న సుమారు 18 మందిని ఎస్ఐలు నియమిస్తున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

బదిలీల జాబితా ఇలా…


ఇదికూడా చదవండి…

బీహారి కూలీల గంజాయి బిజినెస్‌..!