చెత్త‌ను వేరు చేసే అందించాలి

తాండూరు వికారాబాద్

చెత్త‌ను వేరు చేసే అందించాలి
– త‌డి, పొడి చెత్త‌పై మున్సిప‌ల్ అధికారుల అవ‌గాహ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మ‌హిళ‌లు ఇండ్ల‌లో నుంచి త‌డి చెత్త‌ను, పొడి చెత్త‌ను వేరు చేసి అందించాల‌ని తాండూరు మున్సిప‌ల్ అధికారులు సూచించారు. మంగ‌ళ‌వారం తాండూరు ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ ఆదేశాల మేర‌కు ప‌ట్ట‌ణంలోని వివిధ వార్డుల్లో మ‌హిళ‌లు, ప్ర‌జ‌ల‌కు త‌డిచెత్త‌, పొడిచెత్త వేరు చేసి అందించ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్, ఎన్విరాల్ మెంట్ ఇంజ‌నీర్ ప్ర‌వీన్ కుమార్‌గౌడ్‌లు వేరువేరుగా ప్ర‌జ‌లను త‌డి చెత్త‌, పొడి చెత్త సేక‌ర‌ణ గురించి వివ‌రించారు. స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా
ఇంటింటికి అందించిన చెత్త డ‌బ్బాల‌తో త‌డిచెత్త‌, పొడిచెత్త‌ల‌ను ఇండ్ల‌లోనే వేరుచేసుకోవాల‌న్నారు. వేరు చేసి ఉంచిన త‌డి చెత్త‌, పొడిచెత్త‌ను మున్సిప‌ల్ వాహ‌నాల‌కు మాత్ర‌మే అందించాల‌ని సూచించారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఆరు బ‌య‌ట చెత్త వేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో జవాన్ రమేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.