బంటు మల్లప్ప ఇంట్లో నూతన సందడి

తాండూరు రాజకీయం వికారాబాద్

బంటు మల్లప్ప ఇంట్లో నూతన సందడి
– అట్టహాసంగా గృహప్రవేశ వేడుకల ప్రారంభం
– పాల్గొన్న బావనోళ్ల శంకర్ యాదవ్, మిత్రబృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్ ఇంట్లో నూతన గృహ ప్రవేశ సందడి మొదలైంది.
kvcs
సాయిపూర్ లోని న్యూనలంద పాఠశాల పక్కన మల్లప్ప నూతన గృహ ప్రవేశ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ విశ్వంపంతులు ఆధ్వర్యంలో కొత్త ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేధ మంత్రోచ్చరణల మద్య బంటు మల్లప్ప సతీమణి బంటు లక్ష్మీ, కుటుంబ సభ్యులతో కలిసి ద్వార పాలకుల పూజ, గోపూజ, వాస్తుపూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, సర్వతోభద్ర పూజ, కళ్యాణం, వాస్తుహోమం, రుద్రహోమం కార్యక్రమాలు భక్తిశద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్, సతీమణి చంద్రకళ, మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు. బంటు మల్లప్ప, కుటుంబ సభ్యులకు శుభాస్సీసులు తెలిపారు. బావనోళ్ల శంకర్ యాదవ్ దంపతులు బంటు మల్లప్ప దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ యువనాయకులు మధనసిం హారెడ్డి, మనోహర్ యాదవ్, ప్రేమ్ రాజ్, నితిన్, బంధుమిత్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

పాతకుంటలో.. ఫైట్..!