గోడలో నుంచి వచ్చిన వినాయకుడు..!
– హనుమాన్ దేవాలయంలో ప్రత్యక్షమైన విగ్రహం
– చంద్రవంచ గ్రామంలో జరిగిన అద్భుతం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గోడలో నుంచి వినాయక విగ్రహం బయటపడింది. హనుమాన్ దేవాలయంలో ఈ వినాయకుడు బయటకు రావడం విశేషం. తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రవంచ గ్రామంలో పల్లెగూడ ఆంజనేయ స్వామి ఉంది. 40 ఏండ్ల క్రితం నుంచే ఆలయంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే ఆలయంలో ఓ మూలకు విగ్రహ రాయికి చంద్రంపూసే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆలయ పూజారి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం మూలకు ఉన్న విగ్రహానికి చంద్రం పూస్తుండగా రాతి విగ్రహం చేతికి వచ్చింది. దానితో పాటు చేతిలోకి వచ్చిన రాయి కింద విఘ్నేశ్వర విగ్రహం బయటకు వచ్చింది.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పూజారి గ్రామస్తులకు తెలిపారు. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో వినాయక విగ్రహం బయటకు రావడంతో అందరు విఘ్నేశ్వరున్ని దర్శించుకున్నారు. మరోవైపు ఈ దేవాలయం వద్ద ఈనెల 24న కర్ణాటకకు చెందిన మల్లికార్జున ముత్య స్వామి ఆధ్వర్యంలో లింగ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సంఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులంతా దైవ ఘటనగా భావిస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం దె వాలయంలో గోడలో నుంచి బయటపడిన విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.
ఇదికూడా చదవండి…

