హిందూ ఉత్సవ సమితికి ధన్యవాదాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్సవ సమితికి ధన్యవాదాలు
– సమితి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా
– నూతన ఏకగ్రీవ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతో తాండూరు హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి తన శక్తికి మించి తోడ్పడుతానని సమితి నూతన కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
kvcs
హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సమితి గౌరవాధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా ఎన్నికల అధికారి లింగదలి రవికుమార్, హిందూ సమితి సభ్యులు, హైందవ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో కోశాధికారి పదవి అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. రాబోయే రోజుల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు, హిందూ వాహిని, భజరంగ్ దళ్, హిందూ ఉత్సవ సమితీ సభ్యులు, హిందూ సంఘాలు, కుల సంఘాలు అందరి సహాకారంతో హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి, హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తూ సమితి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు