చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత
– పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించాలి
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారులను ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు.

సోమవారం జాతీయ నులిపురుగుల నియంత్రణ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ వైద్య సిబ్బందితో కలిసి పాఠశాలలోని విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను వేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల వల్ల కడుపునొప్పి, రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. కావున నులిపురుగులను నియంత్రించేందుకు 1-19 ఏండ్లు ఉన్న వారికి అల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై దృష్టిసారించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగదేవి, టీచర్లు జగదీశ్వరి, డా. రాజేశ్వరి, ఏఎన్ఎం శాంత, ఆశ వర్కర్ సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

