డయాలసిస్ బాధితులకు ఊరట..! 

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

డయాలసిస్ బాధితులకు ఊరట..! 
– తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కొత్త మిషన్ల ఏర్పాటు
– ప్రారంభించిన ఆరోగ్య శ్రీ జీఎం డా.రాంబాబు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని డయాలసిస్ బాధితులకు ఆరోగ్య శ్రీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఊరట కలిగించే వార్తను అందించారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కిడ్ని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దృష్టిసారించారు. ఆసుపత్రిలో డయాలసిస్ బాధితులకు కొత్త మిషన్లను అందుబాటులోకి తెచ్చారు.
kvcs
ప్రస్తుతం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్‌ లో సుమారు 60 మందికి పైగా డయాలసిస్ సేవలను పొందతుందున్నారు. వేయిటింగ్‌లో మరో 30 మంది ఉంటున్నారు. అయితే ఆసుపత్రిలో డయాలసిస్ సేవలకు సరిపడా మిషన్ల లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లా ఆసుపత్రికి కొత్తగా 5 మిషన్లను మంజూరు చేసింది. సోమవారం ఆరోగ్య శ్రీ రాష్ట్ర జనరల్ మేనేజర్ డా.రాంబాబు, డీవైఈఓ శ్రీనివాస్ లు ఈ కొత్త మిషన్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో ప్రస్తుతం 60 మందికి కేవలం 8 మిషన్లను వి నియోగిస్తున్నారని తెలిపారు. సరిపడా మిషన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు కొత్తగా 5 మిషన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ మిషన్లతో డయాలిస్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ మిషన్ల వల్ల ప్రస్తుతం ఉన్న 60 మందితో పాటు వేయిటింగ్ లో ఉన్న మరో 30 మంది బాధితులకు సేవలు అందుతాయన్నారు.

ఈ సేవలను పొందేందుకు సెల్: 9492913384లకు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. సునీత, ఆరోగ్య శ్రీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ డా. సతీష్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ టీం లీడర్ వీరేశం, తెలంగాణ డయలిస్ అపెక్స్ మేనేజర్ కిషన్, కిషోర్ కుమార్, క్లీనికల్ మేనేజర్, ఆరోగ్య మిత్రలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రండి.. త్వరపడండి..!