మాయా ‘జల’గలు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మాయా ‘జల’గలు..!
– వాటర్ ప్లాంట్లలో ఇష్టారాజ్యం
– గుర్తింపు లేకుండానే నీటి వ్యాపారం
– అనుమతుల్లేవని తెలిసినా పట్టించుకోని అధికారులు
– తాండూరులో పరిస్ధితి ఎలా ఉందంటే…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో పలువురు నీటి వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విచ్చల విడిగా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి.. లైసెన్సులు, గుర్తింపు కార్డులు లేకుండా యధేచ్చగా వ్యాపారం సాగిస్తున్నారు. సంబంధిత అధికారుల నిఘా కరువు అవడంతో వీరి వ్యాపారం లక్షల నుంచి కోట్ల వరకు పడగెత్తుతోంది.
kvcs
తాండూరు పట్టణంలో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రతిరోజూ ఈ వాటర్ ప్లాంట్లలో సుమారు 20 లీటర్ల నీటిని రూ. 10ల నుంచి 30ల వరకు విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలలో వ్యాపారులు ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం గనమార్హం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ట్(బీఐఎస్) నిబంధల ప్రకారం.. 20లీటర్ల నీటిని శుద్ది చేయాలంటే రూ. 18ల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాని వ్యాపారులు సుమారు రూ. 5ల విలువలతోనే నీటిని శుద్ది చేసి రూ. 10 నుంచి 30లకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

నిబంధనలు ఇవే…
నిబంధనల ప్రకారం వాటర్ల ప్లాంట్ ఏర్పాటు సమయంలో రీజినల్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. వాటర్ ప్లాంట్లలో ఎయిర్ కండిషనర్ ఉండాలి. అదేవిధంగా కెమికల్ ల్యాబ్, మైక్రోబయలజీ ల్యాబ్, ఫిల్లింగ్ గది, ప్లాంట్ మొత్తం స్టేయిన్ స్టీల్ ఉండాలి. వీటితో పాటు వాసన, రుచి, డెర్జిడిటీ, టోటల్ డిజ్యూలడ్ సాలిడ్స్, సల్పెడ్, మాంగనీస్ కాపర్ తదితర 51 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి వాటర్‌ ప్లాంట్లలోని క్యాన్లను మార్చాలి ఉంటుంది. మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు చేయాల్సి ఉంటుంది.

ప్రాణాలతో చెలగాటం
వాటర్ ఫిల్టర్ వ్యాపారులు నిబంధనలు పాటించకపోవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థిలు ఏర్పడ్డాయి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో వ్యాపారులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. మాయ జలాలు తాగి డయేరియా, కలరా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

తాండూరు పట్టణంలోని పరిస్థితి ఇలా..
మూడు నెలల క్రితం తాండూరు మున్సిపల్ అధికారులు పట్టణంలోని వాటర్ ఫిల్టర్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పట్టణంలోని వాటర్ ఫిల్టర్‌లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. గుర్తింపుతోపాటు లైసెన్సులు పొందేందుకు వ్యాపారులకు మూడు గడువు ఇచ్చారు. లేదంటే తరువాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వాటర్ ఫిల్టర్ తరువాత నీరు వృధాగా పారకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ హెచ్చరికల గడువు దాటినా అధికారులు వాటర్ ఫిల్టర్ల వ్యాపారులపై కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

సహాకారం పొడగింపు హర్షణీయం