బీజేపీతోనే నీతివంతమైన పాలన..!
– అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ సర్కారు
– ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు అందరు కృషి చేయాలి
– సన్నాహాక సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో బీజేపీ పార్టీ నీతివంతమైన పాలన అందిస్తోందని, ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ కూడా ఆ తరహా పాలన అందించడం బీజేపీకే సాధ్యమవుతుందని టీచర్స్ ఎమ్మెల్సీ ఏవీఎస్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వెంకోబా గార్డెన్ లో బీజేపీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం దేశంలో నీతివంతమైన పాలన అందిస్తోందన్నారు. కొట్లాది సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అప్పుల పాలు చేస్తోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణను కోల్పోయి దిగజార్చిందన్నారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా విచ్చల విడిల నిధుల దుర్వినియోగం చేసిందని, సంపూర్ణ అభివృద్ధిని సాధించడంలో విఫలమయ్యిందన్నారు. ఇందుకు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉదహరించారు. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమంలో చిత్తశుద్ధిని చాటుకోలేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పర్చాలన్నారు.
గెలుపుకోసం అందరు కృషి చేయాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు హన్మంతు ముదిరాజ్, కార్యదర్శి బంటారం సుధాకర్, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, సీనియర్ నాయకులు పూజారి పాండు, కౌన్సిలర్ మల్లప్ప, వాలి శాంతకుమార్, బీరప్ప, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

