మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం
– మత సామరస్యతకు ప్రతీక ఇప్తార్ విందు
– తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
– హాజరైన ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణం చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్. కుమార్ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఫలాహారాలు స్వీకరించి ఉపవాస దీక్షలను విరమించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసాన్ని సంతోషంగా జరుపుకోవాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

