సామాజిక విప్లవ జ్వాల సర్వాయి పాపన్నగౌడ్
– బహజనుల సమానత్వం కోసం కృషి అజరామరం
– తెలంగాణ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి
– తాండూరులో విగ్రహానికి నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బహుజనుల అభ్యున్నతికి కోసం ఎగిసిపడిన విప్లవ జ్వాల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అభివర్ణించారు. సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణం వినాయక చౌరస్తాలోని పాపన్న గౌడ్ విగ్రహానికి మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పంచారు.

ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.

నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమన్నారు. సామాజిక, రాజకీయ సమానత కోసం కృషి చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, పొట్లిమహారాజ్ ఆలయం చైర్మన్ ప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డలి రవీందర్, మాజీ సర్పంచ్ కేశవ్ రావు ,యువ నాయకులు బిర్కెట్ రఘు, భగవాన్, శివానంద్ మడపతి, సిద్ధూ అయ్యా, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

