ఒకరోజు ముందే లడ్డూ వేలం..!
– హిందూ ఉత్సవ సమితి నిర్ణయం
– పండగ నిర్వహణపై డీఎస్పీతో సమావేశం
– ప్రశాంతంగా జరుపుకునేందుకు సహకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈసారి జరిగే వినాయక చవితి ఉత్సవాలలో మార్పులు చేసేందుకు తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి నిర్ణయించింది. వినాయక చవితిలో ఒక రోజు ముందే లడ్డూల వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

శుక్రవారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్ లడ్డూ వేలంపై అభిప్రాయం తెలిపారు. ఈ సారి ఐదు రోజుల పాటు ప్రతిష్ఠించే వినాయకుల వద్ద ఉంచే లడ్డూలను ఒక రోజు ముందే వేలం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే రోజు ముందు వేలం నిర్వహించిన లడ్డూలకు నిమజ్జనం రోజు పూజలు నిర్వహించి వేలంలో దక్కించుకున్నవారికి అందించాలని బాగుంటుందని బావిస్తున్నారు.

మరోవైపు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ పై సమితి సభ్యులు తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణ రెడ్డితో సమావేశం అయ్యారు. పండగ సందర్భంగా నిర్వహకులు పోలీసుల అమలు చేసే నిబంధనలు పాటించేలా చూడాలని డీఎస్పీ సమితి సభ్యులకు సూచించారు. మండలపాలకు అనుమతులు, డీజే సౌండ్ నిషేధం, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు అన్ని పాటించేలా చూడాలని డీఎస్పీ సమితి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సమితి సభ్యులు పండగను ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని విధాల సహాకారం అందిస్తామని అన్నారు. అదేవిధంగా పండగ నిర్వహణపై శాంతి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

అనంతరం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రొంపల్లి సంతోష్, ఉపాధ్యక్షులు గూలి పరమేశ్వర్ స్వామి, శ్రీకాంత్ రెడ్డి, సహాయ కార్యదర్శులు వెంకటేశం(మిర్చి), మంతన్ గౌడ్ అశోక్, కోట్ల రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, రజక నర్సింహా, వడ్డె పరమేష్, సాంస్కృతిక కార్యదర్శులు దేవగారి రమేష్, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకీ, గోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

