ఏటీసీ(ఐటీఐ) పిలుస్తోంది…!
– చేరినోళ్లకు జాబ్ గ్యారెంటీ
– తాండూరులో అందుబాటులోకి కాలేజీ
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ
– ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు, లాస్ట్ డేట్ ఇదే
తాండూరు, దర్శిని ప్రతినిధి : డీగ్రీలు..పీజీలు చదువకుండానే పోటీ ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపేందుకు తాండూరులో ఏటీసీ(ఐటీఐ- పారిశ్రామిక శిక్షణ సంస్థ) ముస్తాబయ్యింది. వివిధ కోర్సులలో చేరేందుకు విద్యార్థులను, యువతను పిలుస్తోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఏటీసీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.

గతంలో సరైన నిర్వహణ లేక ఐటీఐ విద్య అందుబాటులోకి రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీ సెంటర్లుగా మార్చి అధునూతన కోర్సులతో విద్యను అందించేందుకు సంకల్పంచింది. ఇందులో భాగంగా తాండూరులో ఏటీసీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
అందుబాటులో ఉన్న కోర్సులు
1. ఇండ స్టియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యాను ఫ్యాక్చరింగ్ టెక్నీషియన్(సంవత్సరం కోర్సు), 2. మ్యాను ఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్ (సంవత్సరం కోర్సు), 3. ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ (సంవత్సరంకోర్సు), 4. బీడీవీవీ-పర్చువల్ ఎనా లసిస్, డిజైనర్(రెండేళ్లకోర్సు), 5.సీఎన్సీ మెషినిం గ్ టెక్నీషియన్(రెండేళ్లకోర్సు), 6. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (రెండేళ్లకోర్సు)లు అందుబాటులో ఉన్నాయి.

అర్హత, గడువు వివరాలు
అన్ని కోర్సుల్లో కలిపి 172 సీట్లు ఉండగా ఇప్పటివరకు 28 సీట్లు భర్తీ అయ్యాయ న్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఎస్ఎస్సీ మోమో, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్ఫోర్ట్ సైజ్ ఫోటో, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర వివరాలను జతపర్చి ఈనెల 28వ తేదీలోపు ఆన్లైన్లో https://iti.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు 84999 75115కు సంప్రదించాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

వందశాతం ఉద్యోగవకాశాలు
ఏటీసీలో శిక్షణ పొందితే ప్రపంచంలో ఏమూలలో అయినా ఉద్యోగం పొందే నైపుణ్యాలు పొందవచ్చు. అత్యాధునిక మెషినరీతో ప్రత్యక్షంగా అనుభవం పొందవచ్చు. శిక్షణ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఏటీసీలో చేరి ఉద్యోగ కలలను నిజం చేసుకోవచ్చు.

ఇదికూడా చదవండి…

