భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ
– వైభవంగా రథ చక్రాలకు పూజలు
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహరెడ్డి, నేతలు
– జాతర ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి యేడాది ఉగాది పర్వదినాన జాతర ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితి.

ఇందులో భాగంగా గురువారం శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి యేడాది మాదిరిగానే ఉగాది పర్వదినంను పురస్కరించుకుని రథచక్రాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయంలో భద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు మేడి మహేష్‌ సమక్షంలో భద్రేశ్వర స్వామి రథ చక్రాలకు పూజలు నిర్వహించారు.

భక్తులు దేవాలయంలోని రథచక్రాలను బయటకు తెస్తూ.. రథం నిలిచే స్థలంలోకి తీసకవచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా రథచక్రాలకు పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు డా.సంపత్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మహిళ నాయకురాలు గాజుల మాధవి, జాతర ఉత్సవ కమిటి సభ్యులు గంగా శ్రావణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మద్రికే చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూర్ సంకేత్, వీరశైవ సమాజం, యువదళ్ సభ్యులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం..!