మట్టికి మహారూపం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మట్టికి మహారూపం..!
– ఏడేళ్లుగా వినాయకుడి తయారి
– సొంతంగా ఇంట్లో ప్రతిష్టించి పూజలు
– కోట్రిక నాగలక్ష్మీ ప్రతిభ భళా
తాండూరు, దర్శిని ప్రతినిధి : మన ప్రకృతి పంచభూతాల సమూహం.. అందులో భాగమైన భూమిలో మట్టికి మహారూపం అందించి పూజించడం ఎంతో పుణ్యమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోడలు, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అంటున్నారు.
kvcs
వినాయక చవితి సందర్భంగా ఆమె వారి ఇంట్లో మట్టి వినాయకున్ని తయారు చేశారు. ప్రతి యేడాది వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకున్ని తయారు చేస్తున్నారు. ఏడేళ్లుగా ఇంట్లోనే మట్టి వినాయకున్ని తయారు చేసి.. ఆ విగ్రహాన్నే ప్రతిష్టించి పూజిస్తున్నారు. అయితే మట్టి వినాయకున్ని తయారు చేస్తున్న ఆమె నైపుణ్యం అందరిని అబ్బుర పరుస్తోంది. ఎంతో నియమ నిష్టలతో వినాయకున్ని తయారు చేయడం ఆకట్టుకుంది.

ప్రతి ఏడాది విభిన్న రూపాలలో ఆమె వినాయకులను తయారు చేస్తున్నారు. ఈ యేడాది కూడా ఇంట్లోనే ఆమె మట్టి వినాయకునికి మహా రూపం అందించారు. మట్టి వినాయకున్ని తయారు చేసి అందంగా అందంగా అలంకరించారు. వినాయక చవితి వచ్చిదంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్ విగ్రహాలపై మక్కువ చూపిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో కోట్రిక నాగలక్ష్మీ చేస్తున్న మట్టి వినాయకుని తయారి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా కోట్రిక నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని అన్నారు. పంచభూతాల సమూహం అయిన ప్రకృతికి ఎవ్వరు చెడు చేయరాదనే ఉద్దేశంతో మట్టి వినాయకున్ని తయారు చేయడం జరుగుతుందని అన్నారు. అందరు మట్టి వినాకులను ప్రతిష్టించి పూజించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

గణేష్‌ మండపాలకు ఉచిత కరెంట్