పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్..!
– ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్
– ప్రకటించిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

2024 జనవరి 31వ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహణ మందకొడిగా సాగుతోంది. ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం ప్రక్రియను ముమ్మరం చేసింది. ఈ మేరకు పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈనెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ప్రకటనతో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది.

ఇదికూడా చదవండి…

