
తాండూరులో లడ్డూ వేలం షురూ..!
– భద్రేశ్వర గుడి వద్ద తొలి వేలం
– రికార్డు ధరకు దక్కించుకున్న పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వినాయక లడ్డూ వేలం షురూ అయ్యింది. పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం వద్ద వినాయకుడి లడ్డు తొలివేలం నిర్వహించారు.

ఐదు రోజులుగా తాండూరులో వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఐదో రోజు వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డుకు వేలం నిర్వహించడం ఆనవాయితి. ఇందులో భాగంగా పట్టణంలోని భద్రేశ్వర దేవాయలం వద్ద తొలి వేలం నిర్వహించారు. ఈ వేలం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు వేలంలో వినాయక లడ్డూ దక్కించుకున్నారు. రికార్డు స్థాయిలో రూ. 1లక్ష 1వెయ్యి 116లకు ఆయన వినాయక లడ్డూ సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ వినాయక ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. అనంతరం భద్రేశ్వర వినాయక చవితి ఉత్సవ సమితి సభ్యులు లడ్డూ దక్కించుకున్న పట్లోళ్ల నర్సింలును సన్మానించి ఊరేగింపులో బ్యాండు బాజాతో పంపించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

