నేను సిగరెట్ అడిగితే ఇవ్వవా..!
– షాపు యజమానిపై వ్యక్తి దాడి
– కుమారుడి ఫిర్యాదుతో కేసు
– కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నేను సిగరేట్ అడిగితే లేదని.. ఇవ్వనంటావా అంటూ ఓ వ్యక్తి కిరాణాషాపు యజమానిపై కట్టెతో దాడిచేశాడు. బాదితుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండుకు పంపించారు. ఈ సంఘటన కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కరణ్ కోట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామంలో ఈడిగి అంజయ్య గౌడ్ అనే వ్యక్తి పెన్నా ఫ్యాక్టరీ సమీపంలోని గేటు వద్ద కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఈనెల 10వ తేది రాత్రి 9-30 తాండూరు మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన అడివప్ప అనే వ్యక్తి సిగరెట్లు కావాలని కోరాడు. ఇందుకు అంజయ్య గౌడ్ షాపులో సిగరేట్లు లేవని, షాపు మూసేస్తున్నానని తెలిపాడు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అడివప్ప అంజయ్య గౌడ్‌ను బూతులు తిట్టడమే కాకుండా నేను సిగరేట్ అడిగితే ఇవ్వనంటావా అంటూ ఊగిపోయాడు.

అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కట్టెతో తాగిన మైకంలోనే అడివప్ప అంజయ్య గౌడ్‌పై దాడి చేశారు. దీంతో అంజయ్యగౌడ్ ఎడమ చేతికి, కుడిచేతికి రక్తగాయాలయ్యాయి. మరుసటి రోజు అంజయ్య గౌడ్ కుమారుడు ప్రవీణ్ గౌడ్ కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి అడివప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు అడివప్పను శుక్రవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచడం జరిగిందని కరణ్ కోట్ పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…


