మేనత్త అని కూడా చూడలేదు..!
– పాతకక్ష్యలతోనే ప్రాణం తీశాడు
– మెడలో పుస్తెలు, బంగారంతో పరార్
– అల్లుడిని రిమాండుకు పంపించిన పోలీసులు
– అనుమానాలు వీడిన మహిళ దారుణ హత్య
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మేనత్త అనే బంధుప్రీతిని కూడా చూడకుండా గొడ్డలితో తలపై దాడి చేసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం పట్ట పగలే దారుణంగా మహిళను హత్య చేసిన కేసును పట్టణ పోలీసులు చేధించారు.

పాత కక్ష్యలను మనుసులో పెట్టుకుని అత్తను హత్యచేసిన అల్లుడిని తాండూరు పట్టణ పోలీసులు రిమాండుకు తరలించారు. సోమవారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఆదివారం తాండూరు పట్టణం మల్లప్ప మడిగ వద్ద వాల్మీకీనగర్ కు చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ (40) హత్యకు గురైన సంఘటన తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి పద్మమ్మను ఆమె అల్లుడు తాండూరు మండలం చింతామణిపట్నం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల వెంకట్ అలియాస్ వెంకటయ్యగా గుర్తించారు. పాతకక్ష్య మనసులో పెట్టుకుని ఆదివారం మల్లప్ప మడిగ వద్ద ఉన్న పద్మమ్మను వెంకట్ వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమె తలపై దాడి చేశాడు.

పద్మమ్మ ఒంటిపై ఉన్న నల్లపూసల దండలు దొంగిలించి పరయ్యాడు. మృతురాలి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం చింతామణిపట్నంలో ఉన్న వెంకట్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇనుప గొడ్డలి, 3 తులాల పుస్తెల తాడు, 1.2 తులాల బంగారు నల్లపూసల దండ, టీవీఎస్ మోటారు సైకిల్ ను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

