మోసపోవద్దు.. గోస పడోద్దు..!
– ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే ఆదరించండి
– 23వ వార్డు అభ్యర్థి మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర పార్టీలను నమ్మి మోసపోయి.. ఎన్నికల తరవాత గోస పడే పరిస్థితులు తెచ్చుకోవద్దని.. అభివృద్ధిని చేసిన బీఆర్ఎస్ పార్టీనే ఆదరించాలని పార్టీ మాజీ కౌన్సిలర్, 23 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పరిమళ రవీందర్ అన్నారు.

గురువారం వార్డులోని వాల్మీకీ నగర్, సీసీఐ కాలనీలో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కారు గుర్తును ప్రదర్శిస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులలో ఉంటానని, అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని భరోసా అందిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతానని తెలిపారు. ఇతర పార్టీలను నమ్మి మళ్లీ మోసపోవద్దని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

