దుర్గామాత చౌరస్తాపై నిర్ణయం తీసుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

దుర్గామాత చౌరస్తాపై నిర్ణయం తీసుకోవాలి
– అమ్మవారి ఆశీస్సులతో అందరు అభివృద్ధి చెందాలి
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్  రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం బసవణ్ణ ప్రాంతాన్ని దుర్గామాత చౌరస్తాగా ఏర్పాటు చేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ  చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను రాజుగౌడ్ దర్శించుకున్నారు.

అనంతరం ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. తాండూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో బసవణ్ణ కట్ట వద్ద 30 ఏండ్లుగా దుర్గామాతను ప్రతిష్టిస్తుండడం అభినందనీయమని అన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని దుర్గామాత చౌరస్తాగా మార్చాలని కౌన్సిల్ తీర్మానించడం జరిగిందన్నారు. తాజాగా దుర్గామాత చౌరస్తా ఏర్పాటుపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు, నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి