మత్తుపై ఉక్కుపాదం..!

క్రైం తాండూరు వికారాబాద్

మత్తుపై ఉక్కుపాదం..!
– గంజాయి విక్రయాలపై విస్తృత తనిఖీలు
– తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని తాండూరు ఎక్సెజ్ సీఐ అనంతయ్య అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో గంజాయి, గంజాయి చాక్లెట్ల విక్రయాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐ అనంతయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని హెయిర్ సెలూన్లు, టైలర్ షాపులు, పాన్ షాపులతో పాటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గంజాయి, గంజాయి చాక్లెట్లతో పాటు మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నారని అనుమానాలపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. కాని ఎక్కడా అలాంటివి లభించలేదన్నారు.

పట్టణంలో ఎక్కడైనా, ఎవరైనా మత్తు పదార్థాలు, గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సెల్: 8712658754, తాండూరు ఎక్సెజ్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పట్టణంలో ఎక్కడా విక్రయాలు చేపట్టకుండా ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎవరైనా విక్రయాలకు పాల్పడితే చట్టరిత్య చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు కోకట్ రోడ్డులోని ఓ బెల్టుషాపులో మద్యం విక్రయాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!