బీసీ రిజర్వేషన్లు ఖరారు..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

బీసీ రిజర్వేషన్లు ఖరారు..!
– జీవో జారి చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9 విడుదల చేసింది. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లకు ఆమోదం పొందింది.

తాజాగా శుక్రవారం ఆర్టికల్స్ 40, 243D, 243Tతో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం అమలులోకి రాబోయే ఈ రిజర్వేషన్లతో తెలంగాణ దేశంలోనే తొలిసారి బీసీలకు పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల ప్రాధాన్యం మరింత బలపడనుంది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుండడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

సల్లంగా చూడూ దుర్గామాత..!