టపాసుల దుకాణాలపై నిషేధం..!
– జనావాసాల మద్య ఏర్పాటు చేస్తే చర్యలు
– తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో టపాసుల దుకాణాలపై నిషేధ ఆంక్షలు విధించడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ యాదగిరి తెలిపారు. బుధవారం మున్సిపల్ కమీషనర్ యాదగిరి పట్టణంలోని బాణా సంచా దుకాణాల వ్యాపారులతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వచ్చే దీపావళీ పండగ సందర్భంగా ఏర్పాటు చేసుకునే టపాసుల దుకాణాల ఏర్పాటులో నిషేధ ఆంక్షలు విధిండచం జరుగుతుందని చెప్పారు. ప్రతి దుకాణానికి అనుమతులు తప్పనిసరిగా పొందాలని అన్నారు. ఏర్పాటు చేసే దుకాణాలు జనావాసాల మధ్య ఉండరాదని స్పష్టం చేశారు.

పట్టణంలో విశాలమైన ఓ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందరు అక్కడే దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మద్య దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దుకాణాలకు అవసరమయ్యే లైసెన్స్ పొందడానికి ముందు ఎన్టిసీల పొందాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్లు ఉమేష్ కుమార్, వెంకటయ్య, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

