రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ..!
– రేపు సీతారాముల విగ్రహా పునప్రతిష్టాపన
– దేవాలయం ముందు ధ్వజస్థంబ స్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. రెండు రోజులుగా దేవాలయంలో సీతారాముల విగ్రహా పునఃప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా మంగళవారం దేవాలయంలో వేద పారాయణం, ముఖ్యదేవత జపము, ప్రతిష్టాంగ హోమాలు, దాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో దేవాలయమ ధ్వనించింది. ఇందిరానగర్‌కు చెందిన పలువురు దంపతులు హోమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులు దేవాలయానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.

బుధవారం దేవాలయంలో సీతారాములు, లక్ష్మణ, హనుంతుడు విగ్రహాలతో పాటు ధ్వజస్థంభ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటి సభ్యులు తెలిపారు. గురువారం నుంచి సీతారాముల కళ్యాణోత్సవాలు ప్రారంభవుమతారని తెలిపారు. 27వ తేది వరకు కొనసాగే ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను జయప్రదం చేయడంతో పాటు స్వామి కృపపాత్రులు కాగలరని విజ్ఞఫ్తి చేశారు.


