గుమాస్తా నగర్‌లో గులాబీ పండగ

తాండూరు రాజకీయం వికారాబాద్

గుమాస్తా నగర్‌లో గులాబీ పండగ
– ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
– జెండా ఆవిష్కరించి.. జై కొట్టిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం 26 వ వార్డు గుమాస్తా నగర్‌లో గులాబీ పండగ ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో ఉత్సహాంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వార్డులో గులాబీ జెండా పండగ నిర్వహించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంకాల రాఘవేందర్ సమక్షంలో పార్టీ సీనీయర్ నాయకులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధ జరుగుతోందని, మరోసారి బీఆర్ఎస్ పార్టీని అందరు ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ వార్డు ప్రెసిడెంట్ చెన్బసప్ప, ఇంచార్జ్ శ్రీనివాస్ చారి, నాయకులు బంటారం సుధాకర్, కోటం ప్రసాద్, టి రవి, కుంచెం మురళి, అశోక్, నరేందర్, దినేష్, ప్రశాంత్, చంద్రుమోహన్, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.