గడప గడపకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గడప గడపకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’..!
– సర్కారు అబద్దాలు, మోసాలపై బ్రహ్మస్త్రం
– ప్రజలను చైతన్య పర్చడమే బీఆర్ఎస్ ధ్యేయం
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అబద్దపు హామీలు, అధికారం కోసం చేసిన మోసాలను ప్రజలకు తెలిపేందుకు కాంగ్రెస్ బాకీ కార్డును బ్రహ్మస్త్రంగా మార్చుకోవాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్ బాకీ కార్డు కరపత్రాలను పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామిలను ఇచ్చి.. 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందని గుర్తుచేశారు. 22 నెలలు గడుస్తున్నా హామిలను సక్రమంగా అమలు చేయకుండా దగా చేసిందని విమర్శించారు.
kvcs
అడ్డగోలు హామీలు, అబద్దపు పునాధులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డులను తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలకు వివరించి చైతన్య పర్చేలా పనిచేయాలన్నారు. ఒక్కొక్కరికి కాంగ్రెస్ com పార్టీ ఎంత బాకీ పడిందో తెలిపేందుకు బాకీ కార్డును బ్రహ్మాస్త్రంలా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, ఆర్సీ గౌడ్, పటేల్ ఉమాశంకర్, శకుంతల దేశ్ పాండే, చంటియాదవ్, ఎబినేజర్, సందీప్ రెడ్డి, వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ రిజర్వేషన్లపై స్టే..!