మొబైళ్లకు ఎమర్జెన్సీ ఫ్లాష్ మెసేజ్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మొబైళ్లకు ఎమర్జెన్సీ ఫ్లాష్ మెసేజ్..!
– ఆందోళనలో వినియోగదారులు
– ఎందుకోవచ్చిందో తెలుసా..?
– క్లారీటీ ఇచ్చిన కేంద్రం
దర్శిని డెస్క్‌: కొన్ని గంటల క్రితం మొబైల్‌ ఫోన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఎందుకోచ్చిందో తెలియక వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన కేంద్రం క్లారీటి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలుమార్లు పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రాగా.. తాజాగా మరోసారి ఈ సందేశం వచ్చింది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ఈ అలర్ట్‌ను పంపించారు. మెసేజ్‌తో పాటు ఆ సందేశం ఆడియో రూపంలోనూ వినబడింది. దీంతో యూజర్లు ఒకింత ఆందోళనకు గురయ్యారు. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదని, దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపింది. ఎందుకు వచ్చిందంటే.. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థ (Emergency Alert System)ను రూపొందించింది. ‘‘టెలికమ్యూనికేషన్‌ విభాగానికి (Department of Telecommunication) చెందిన సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పంపించిన నమూనా టెస్టింగ్‌ మెసేజ్‌ ఇది. పరీక్షలో భాగంగా.. గురువారం ఉదయం 11.41 గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ వచ్చింది. ఇలా గతంలో జులై 20వ తేదీ, ఆగస్టు 17వ తేదీల్లోనూ కొంతమంది యూజర్లకు ఈ మెసేజ్‌ వచ్చింది. కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఎమర్జెన్సీ అరెస్టు మెసేజ్‌లోని సారాంశాన్ని పైన ఉన్న ఫోటోలో చూడొచ్చు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు