సర్కారు వైద్యానికి గులాం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారు వైద్యానికి గులాం..!
– పైసా ఖర్చులేకుండా ఆపరేషన్లు
– ప్రభుత్వ దవాఖాన సేవలపై సంతృప్తి
– ఆసుపత్రి సూపరిండెంట్ కు ధన్యవాదాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సేవలకు పేదలు గులాం అవుతున్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డ.. సర్కారు దవాఖానకు అనే పాటను పోదాం పావే బిడ్డా సర్కారు దవాఖానకు అనే తిరిగి పాడుకునే పాటలోని భరోసాను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిజం చేస్తోంది. జిల్లా ఆసుపత్రి ద్వారా పేదలకు కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ మంచి ఆదరణ మూటగట్టుకోంటోంది.

ఆసుపత్రిలో వసతులు ఇబ్బందులు పెడుతున్నా.. మొండి ధైర్యంతో సేవలను అందిస్తోంది. పేదలకు పైసా ఖర్చులేకుండా ఆపరేషన్లు చేస్తూ ధైర్యం అందిస్తోంది. గత ఐదు రోజుల క్రితం తాండూరు మండలం కరణ్ కోట్ కు చెందిన చాకలి మాణిక్యప్ప అనే వ్యక్తిని అతని బావమరిది బంటారం మండల కేంద్రానికి చాకలి నర్సింలు కలిసేందుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో మార్గ మద్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతని చేతికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఆయను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చేయికి ఆపరేషన్ చేయాలని ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ కుటుంభీకులకు సూచించారు. ఎలాంటి పైసా లేకుండా ఆసుపత్రి చేస్తామని భరోసా అందించారు.
kvcs
సోమవారం ఆరోగ్య శ్రీ కింద సూపరిండెంట్ డా. వినయ్ ఆధ్వర్యంలో నర్సింలుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో పాటు నర్సింలు క్షేమంగా కోలుకుంటున్నారు. ఇదేవిధంగా ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చేరిన సాయిపూర్ కు చెందిన ఓ వ్యక్తితో పాటు మరో బాలికకు కూడా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. పేదలకు సర్కారు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై బాధిత కుటుంబాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేసన్లు చేయించుకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పోరేట్కు ధీటుగా వైద్య సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

బైపాస్.. పరిహారం మంజూరు చేయండి