మందులోడు.. మాయలోడూ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మందులోడు.. మాయలోడూ..!
– కోట్ల రూపాయిలు దోచుకుని టోకరా
– ఫ్యామిలీతో కలిసి పరార్
– లబోదిబోమంటున్న బాధితులు
– తాండూరులో హాట్‌ టాపిక్‌ ఇదే
తాండూరు, దర్శిని ప్రతినిధి : మందుల వ్యాపారం చేసే ఓ వ్యాపారి మోసగాడి అవతారం ఎత్తాడు. నమ్మిన వారి వద్ద డబ్బులు పోగేసుకుని మాయమైపోయాడు. కుటుంబంతో సహా పరారిలో ఉన్నాడు. మోసపోయిన బాధితులు లబోదిబో మంటూ పోలీస్టేషన్‌కు పరుగులు పెడుతున్నారు.

పదుల కోట్లకు టోకరా వేసిన మాయగాడి వ్యవహారం తాండూరు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. తాండూరు పట్టణంలోని మార్వాడి బజార్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానిక రైల్వేస్టేషన్ మార్గంలో ఓ మందుల దుకాణంతో పాటు ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. వాటితో పాటు చిట్టీల వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఆయనకు ఇద్దరు కుమారులు కూడా సాయంగా ఉంటున్నారు. ఎంతో కాలంగా అందరితో నమ్మకంతో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. చిట్టీల వ్యాపారం కూడా చేస్తున్నాడు. లక్షల నుంచి కోట్ల రూపాయిలతో లావాదేవిలు జరిపిస్తున్నాడు.
kvcs
దీంతో సామాన్య కూలీ నుంచి మద్యతరగతి ప్రజలు, బడా వ్యాపారులు కూడా అటు వ్యాపారంలో, చిట్టీలపై సొమ్మును దాచుకున్నారు. సరిగ్గా దీపావళి రోజు అందరితో ఆనందంగా గడిపిన ఆ వ్యాపారి.. అ మరుసటి రోజే కుటుంబంతో కలిసి పరారయ్యాడు. వారం రోజులుగా వ్యాపారి కనిపించకపోవడంతో అనుమానం కలిగింది. విచారించగా వ్యాపారి కుటుంబంతో కలిసి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారుల నుంచి.. సామాన్య ప్రజలు దాచుకున్న డబ్బులతో ఆ వ్యాపారి ఉడాయించారని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.

తమకు న్యాయం చేస్తారేమో అని తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. పారిపోయిన ఈ వ్యాపారి సుమారు రూ. 13 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అందరికి టోకరా వేసి పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. దీంతో ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని పోలీసులు చెబుతున్నారు. తాండూరులోని మందులోడు ఎంత మాయాచేశాడో అని ప్రజలు చర్చించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా మాయపోయిన పోయిన వ్యాపారి పక్కా ప్లాన్‌తో పారిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి తరువాత ఐపీ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదికూడా చదవండి…

మిస్టరీ డ్రోన్లు మళ్లీ ప్రత్యక్షం..!