కసాయి అల్లుడు..!
– మామపై పెట్రోల్ పోసి నిప్పు
– ఆస్తి రాసివ్వడం లేదని దారుణం
– అల్లుడు, కూతురులపై కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి రాసివ్వడం లేని అల్లుడు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణానికి కన్నకూతురే అల్లుడుకు సహకరించింది.

ఈ సంఘటన యాలాల మండలం బెన్నూరు గ్రామంలో జరిగింది. యాలాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ కులవృత్తి చేసుకుంటూ స్థానికంగా ఉంటున్నాడు. తన కూతురు అనితను కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చిత్తాపూర్కు చెందిన అర్జున్ పవార్‌కు ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు కొన్నాళ్లుగా కృష్ణపేరిట ఉన్న రెండెకరాల పొలంతో పాటు ఇంటిని తమకు రాసివ్వాలంటూ.. గొడవ పడుతున్నారు.

ఈ క్రమంలో గురువారం ఇదే విషయమై మాటామాటా పెరగగా, కృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 25 శాతం కాలిన గాయాలతో పడిపోయిన బాధితుడిని స్థానికుల సమాచారంతో పోలీసులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి బంధువు నగేశ్ పవార్ ఫిర్యాదు మేరకు.. కూతురు అనిత, అల్లుడు అర్జున్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

