జ‌బ్బార్ కుటుంబాన్ని ఆదుకుంటాం

తాండూరు వికారాబాద్

జ‌బ్బార్ కుటుంబాన్ని ఆదుకుంటాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇటీవ‌ల రాజీవ్ కాలనీ సమీపంలో మృతిచెందిన జబ్బార్ కుటుంబాన్ని ఆదుకుంటామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధ‌వారం తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని జబ్బార్ కుటుంబ సభ్యులు కాల‌నీ వాసుల‌తో క‌లిసి వ‌చ్చి క‌లిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జబ్బార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. జబ్బార్ కుటుంబంలోని ఒకరికి మాతా శిశు ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామ‌న్నారు. అంతేకాకుండా వారి పిల్లలను మైనార్టీ హాస్టల్ లో చేర్పించి విద్య‌నందించేలా చూస్తామ‌న్నారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ రెండో విడతలో కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయకులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, కౌన్సిల‌ర్లు వెంక‌న్న‌గౌడ్, ముక్తార్, ఉర్ధూఘ‌ర్ మాజీ చైర్మన్ స‌లీం త‌దిత‌రులు పాల్గొన్నారు.