ఇరుముళ్లతో శబరికి..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇరుముళ్లతో శబరికి..!
– తాండూరు నుంచి బయల్దేరిన స్వాములు
– కరోనా అంతం కావాలని వేడుకోలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమాలతో అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన తాండూరు అయ్యప్ప స్వాములు శబరి యాత్రకు బయల్దేరారు. ఆదివారం తాండూరు అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి తరలివెళ్లారు. గురుస్వాములు ఆధ్వర్యంలో స్వాములు శబరి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి ఇష్టమైన ఇరుముళ్లను కట్టుకున్నారు. అంతకుముందు ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది. కరోనా మహమ్మారి అంతం కావాలని స్వామిని వేడుకున్నారు. అదేవిధంగా శబరికి బయల్దేరిన స్వాములను కుటుంబ సభ్యులు, భక్తులు పాదాభివందనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప స్వాములు తలపై ఇరుముళ్లను పెట్టుకుని మణికంఠ నామస్మరణతో ముందుకు సాగారు.