మున్సిపల్ జవాన్ల ‘పైసా.. వసూల్’..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ జవాన్ల ‘పైసా.. వసూల్’..!
– రెగ్యులర్ కార్మికుల నుంచి డబ్బులు
– ఒక్కో కారణానికి ఒక్కొ రేటు
– కమీషనర్ ఏమంటున్నారంటే…?
తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ జవాన్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మున్సిపల్‌లో రెగ్యులర్‌గ్‌ పనిచేస్తన్న పారిశుద్ధ్య కార్మికులను డబ్బులు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి రూ. 2వేల నుంచి 4 వేల వరకు వసూలు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో సుమారు 50 మంది వరకు రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అన్ని వార్డుల్లో రెగ్యులర్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల కంటే రెగ్యులర్ కార్మికులకు వేతనాలు ఎక్కువ. అయితే రెగ్యులర్‌ కార్మికులు అనారోగ్యానికి గురైతే.. అత్యవసర పనుల్లో ఉంటే వారి స్థానంలో తమ సంబంధితకులను, తెలిసిన వారిని విధల్లో ఉంచి వెళతారు. ఈ విషయం శానిటరీ ఇనుస్పెక్టర్లు, జవాన్లకు తెలిసే జరుగుతోంది. దీనినే ఆయుధంగా వాడుకుని జవార్లు రెగ్యులర్‌ కార్మికుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
kvcs
ఒక్కో కారణంతో రూ. 2వేల నుంచి రూ. 4వేల వరకు వసూలు చేస్తున్నారని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఏమంటున్నారంటే.. మున్సిపల్ కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, శానిటరీ ఇన్స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు. రెగ్యులర్ కార్మికులతోనే పారి శుధ్య పనులు చేయించాలని వారి స్థానంలో ఇతర వ్యక్తులతో పనులు చేయించడం నిబంధనలకు విరుద్దమని చెప్పారు. కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు.

ఇదికూడా చదవండి…

బస్సు ఢీకొని బస్సు మెకానిక్ మృతి