బీసీ న్యాయ సాధన దీక్షకు మద్దతు
– తాండూరు నుంచి తరలివెళ్లిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు దర్న చౌరస్తా వద్ద నిర్వహించిన బీసీ న్యాయ సాధన దీక్షకు తాండూరు బీసీ నేతలు మద్దతు తెలిపారు.

బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన బీసీ సంఘం నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. దీక్ష వద్ద బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యతో పాటు నేతలను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్ మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు అయినా చేస్తామని అన్నారు.

ఆర్. కృష్ణయ్య, కందుకూరి రాజ్ కుమార్ నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవైఎఫ్ అధ్యక్షులు విజయేందర్, విద్యావేత్త సాంబూరి చంద్రశేఖర్, బీసీ సంఘం యువనాయకులు రాంరెడ్డి, వినోద్, అఖిల్, ప్రశాంత్, వివేక్, పరమేష్, రాజేందర్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

