అనుమానాస్పద స్థితి మృతిలో ట్విస్ట్..!
– వ్యక్తి ఎలా మరణించాడో సీసీ కెమెరాల్లో రికార్డు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి ఘటనలో బిగ్ ట్విస్ట్ వచ్చింది. వ్యక్తి ఎలా మరణించాడో సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన రాము నాయక్(50) అనే వ్యక్తి తాండూరు పట్టణం ఎడ్ల బజార్ సమీపంలో మృతదేహాంగా కనిపించడంతో అతని మరణంపై అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే. రాము నాయక్ తలపై రక్తగాయాలు కనిపించడం ఆందోళన కరంగా మారింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీస్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడం.. రాము నాయక్‌ను హత్య చేశారని ఆరోపించడంతో ఉద్రిక్తంగా మారింది.

చివరకు రాము నాయక్ మృతి చెందిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాము నాయక్‌కు మూర్చ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అకస్మాత్తుగా మూర్చ రావడంతో రాము నాయక్ కుప్పకూలీ పడిపోయినట్లు సీసీ కెమెరాల రికార్డులో కనిపించింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రాము నాయక్ బాడీని పక్కన పెట్టారు. కాసేపటికే రాము నాయక్ మృతి చెందినట్లు కనిపిస్తోంది.
సీసీ కెమెరా వీడియో కింద

ఇదికూడా చదవండి…

