పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
– 22ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు
– చదువు నేర్పిన ఉపాధ్యాయులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపంగా జరిగింది. పట్టణంలోని విద్యా భారతి స్కూల్ 2001-2002 పదవ తరగతి చదువకున్న విద్యార్థులు దాదాపు 22 ఏండ్ల తరువాత ఒకేచోట కలుసుకున్నారు. శుక్రవారం పట్టణంలోని దుర్గా గ్రాండ్ హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదపూజలు చేసి జ్ఞాపికలను అందజేసి పూలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని సంతోషంగా గడిపారు.
ఈ కార్యక్రమంలో విద్యా భారతి స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రభులింగం, ఉపాధ్యాయులు, పీఆర్టీయూ అధ్యక్షులు నారాయణ గౌడ్, శ్రీనివాస్, భాస్కర్, ఉదయ్ కుమార్, హనుమంతు, అంతారం లలిత(మున్సిపల్ కౌన్సిలర్ – బీజేపీ), శివ లీల, గంగమ్మ, స్వరూప గీత, ఉమా, చంద్రకళ, శశిరేఖ, పాఠశాల ఆయా బన్నమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

