క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు
– షూటింగ్ బాల్ అసోసియేషన్ నేతలు
– ఎంపిక పోటీలో 25 మంది ప్రతిభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదవుతో పాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి.గోపాలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షులు అంజిలు అన్నారు.

శనివారం తాండూరు పట్టణం మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఐలయ్య ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రాములు ఆధ్వర్యంలో ఉమెన్స్ టూ ఆల్ విభాగంలో ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన 25 మందిని ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి.గోపాలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షులు అంజిలు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ పోటీలో ప్రతిభను కనబరిచిన వారిని ఈనెల 13, 14వ తేదిలలో తాండూరుపట్టణంలోని సేయింట్ మార్క్స్ హై స్కూల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి రాములు, పీడీపీఈటీలు రాము, గోపిక, బాలమణి, జ్యోతి, రవీందర్ రెడ్డి, మోహిజ్, సాహెబ్, పాఠశాల ప్రిన్సిపల్, ఈటీలు, బాలికలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

