ఫోన్ చేయండి.. ఫిర్యాదు చెప్పండి..!
– ప్రజా సమస్యల పరిష్కారంపై బల్దియా ఫోకస్
– కార్యాలయంలో ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ
– తాండూరు మున్సిపల్ కమీషనర్ బి.యాదగిరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫోన్ చేయండి.. గిప్ట్ పొందండి.. స్క్రాచ్ చేయండి.. బహుమతి తీసుకోండి అనే మాటలు ఇప్పటి వరకు విని ఉంటాం. తాండూరు మున్సిపల్ అధికారులు మాత్రం ఫోన్ చేయండి.. పిర్యాదు చేయండి అంటూ కొత్త ఊతమాట చెబుతున్నారు.

తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్ బి. యాదగిరి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో సమస్యలు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులోని ముఖ్య ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్, తాగునీరు, విద్యుత్ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది వివరాలను గోడలపై రాయించడం జరిగిందన్నారు.

స్థానికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లేని యెడల మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ విభాగంలో ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేయించాలని సూచించారు. అట్టి ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తారని, మేజర్ సమస్యలు ఏమైనా ఉంటే వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంబంధిత అధికారుల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే అప్పుడు నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. వాటిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

