వీర జవాన్లకు ఘన నివాళులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వీర జవాన్లకు ఘన నివాళులు..!
– పుల్వామా అమరులను తలుచుకున్న తాండూరు
– కొవ్వొత్తులతో అంజలి ఘటించిన పెద్దలు, యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులను తాండూరు ప్రజలు, యువకులు స్మరించుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలో 2019 ఫిబ్రవరి 14 ఉగ్రవాదుల‌ దాడిలో అసువులు బాసిన వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి.. అంజలి ఘటించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14న జమ్మూక‌శ్మీర్ నేషనల్ హైవే పైన సైనికుల వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి చేయ‌డంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారని గుర్తు చేశారు.

ఈ దాడి జరిగి ఐదేళ్లు పూర్తయిందని అన్నారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సైనికుల వీరత్వానికి నాంది పలుకుతుందన్నారు. సైనికుల త్యాగం, దేశం పట్ల మీ అచంచలమైన అంకిత భావాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కార్మికులకు కోపమొచ్చింది..!