శ్రీ సాయి మేధలో ఘనంగా గణిత దినోత్సవం
. ఆకట్టుకున్న విద్యార్థుల గణిత ప్రయోగాలు
. గణిత ఉపాధ్యాయులకు సన్మానం
. విద్యార్థులు ఉపాధ్యాయులై పాఠ్యాంశాల బోధన
. బహుమతులు అందజేసిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: గణిత శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 138 జయంతిని తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

అదేవిధంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠ్యాంశాలను బోధించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు తయారు చేసిన గణిత ఫార్ములాల చార్టులలో నైపుణ్యత కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. గణిత ఉపాధ్యాయులను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస రామాంజన్ అతి చిన్న వయసులోనే అపారమైన మేధస్సుతో ప్రపంచ శిఖరాలపై భారతదేశం కీర్తిని చాటి చెప్పిన మేధావి అన్నారు. దాదాపుగా 3900 గణిత సమీకరణాలను కనుగొన్నాడని అందుకే మన దేశం ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. విద్యార్థులు రామాంజన్ ని ఆదర్శం తీసుకొని గణిత శాస్త్రంలో నైపుణ్యతను పెంపొందించుకొని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎదగాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ చక్కగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

