తాండూరులో ఏం.. జరుగుతోంది..?!
– కలకలం రేపిన రాజీవ్ కాలనీ ఘటన
– మరో రెండు ఘటనలతో టెన్షన్..?
– పరిణామాలపై డీఐజీ, జిల్లా ఎస్పీల ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో టెన్షన్ వాతావరం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. ఇక్కడి ప్రాంతంలో జరిగిన ఘటనలు ఇందుకు దారితీశాయని పలువురు చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ సమీపంలో తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దీంతో పాటు కాలనీ వాసులు చేసిన వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు తాండూరు పట్టణం పాత తాండూరులో గురువారం రాత్రి జరిగిన సంఘటన వివాదాస్పదంగా మారినా.. శుక్రవారం నాటికి సద్దుమణిగినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాండూరు మండలం, పట్టణ పోలీస్టేషన్ పరిధి అంతారం గ్రామంలో ఫ్లేక్సీ వార్ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లుగా తెలిసింది. తాండూరు పట్టణంలో ఒక రోజులో జరిగిన ఘటనపై పోలీసు శాఖ అప్రమత్త చర్యలు తీసుకుంది. తాండూరులో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆరా తీశారు. గురువారం రాత్రి తాండూరును సందర్శించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాలతో కలిసి తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ సీఐ సంతోష్ కుమార్‌లతో కలిసి ఆరా తీశారు. మరోవైపు తాండూరులో జరుగుతున్న పరిణామాలపై ఇంటలిజెన్స్ విభాగం అధికారులు కూడా నిఘా ఉంచారు.

ఇదికూడా చదవండి…

