రామ మందిరానికి విరాళాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రామ మందిరానికి విరాళాలు..!
– ఆర్థిక సాయం అందించిన భరత్‌ రెడ్డి
– చేయూత అందించిన చిన్ముద్ర ఆశ్రమం స్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామ మందిరానికి భక్తులు విరాళాలు అందిస్తూ భక్తిభావం చాటుకుంటన్నారు.

దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం దేవాలయ కమిటి సభ్యులు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. శుక్రవారం తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భరత్ రెడ్డి తన కుమారుడు శాశ్వత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం తన వంతుగా రూ. 20116 వేలను దేవాలయ కమిటి సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా దేవాలయ కమిటి సభ్యలు భరత్ రెడ్డి దంపతులను కుటుంబ సభ్యులను అభినందించారు. అదేవిధంగా పట్టణంలోని బసవన్న కట్ట సమీపంలో గల చిన్ముద్ర అయ్యప్ప స్వాముల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పలువులు దేవాలయ పునర్నిర్మానం కోసం 40 వేల రూపాయలను అందించారు.

ఇదికూడా చదవండి…

వామ్మో అర్ధరాత్రి దొంగలు…!