‘గ్లాట్ – 2026’ పోస్టర్ ఆవిష్కరణ..!
– జిల్లా ఇంటర్ నోడల్ అధికారి చేతుల మీదుగా విడుదల
– తాండూరులో సాదాసీదా సంబరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్లాట్ (గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగా) నూతన సంవత్సరం 2026 పోస్టర్ ఆవిష్కరణ తాండూరులో సాదాసీదాగా జరిగింది.

మంగళవారం తాండూరు పట్టణంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి శంకర్ నాయక్ చేతుల మీదుగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లెక్చరర్స్ కళాశాల విద్యా బలోపేతంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దె ందకు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ కాలేజీల విద్యపై నమ్మకం పెంచేలా దృష్టిసారించాలని అన్నారు. అదేవిధంగా లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికి గ్లాట్ ముందుకు సాగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శి డా.ప్రకాష్, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, సయ్యద్ సిరాజుద్దిన్, షేక్ సుల్తాన్, ఇస్రత్ ఉన్నిసా తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

