తాండూరు నియోజకవర్గంకు రూ. 10 కోట్లు..!
– ఉపాధి హామి పథకం కింద మంజూరు
– విడుదలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ
– నిధుల వినియోగానికి ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంకు రూ. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మహాత్మ గాంధీ జాతీయ ఉఫాది హామీ ఫథకం ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయి.

నియోజకవరగ్ంలోని నాలుగు మండలాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. నిధుల మంజూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ఉపాధి హామి కింద మంజూరైన ఈ నిధులతో గ్రామాల్లోని మహిళా సమఖ్యా భవానలు, వీఓఎ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడల నిర్మాణానికి వినియోగించడం జరగుఉతుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా మంజూరైన పనులను న్యాణత ప్రమాణాలు పాటిస్తూ వెంటనే ప్రారంభించాలని సంబందిత అధికారులకు సూచించారు. అదే విధంగా త్వరలోనే మరో కొన్ని గ్రామాలకు మహిళా సంఘాల భవనాలు, వీఓఎ భవనాలు, స్కూల్ కాంపౌండ్ లతో పాటు నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలతో పాటు వివిధ పనులకు నిధులు మంజూరు అవుతాయి అని తెలిపారు. గ్రామాలకు నిధులు మంజూరు కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

