చంద్రవంచలో.. చిచ్చు..!
– గ్రామంలో అర్దరాత్రి ఇరువర్గాల ఘర్షణ
– అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌కు గాయాలు
– ఘర్షణ కారకులపై పోలీసులు సీరీయస్
– 15 నుంచి 20 మందిపై కేసుల నమోదు
– అసలేం జరిగిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో ఇరువర్గాల మద్య చిచ్చు రేగింది. అర్దరాత్రి వేళ ఇండ్లల్లోకి చొరబడి పరస్పర దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకుని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ గాయాలపాలయ్యాడు. సోమవారం అర్దరాత్రి జరిగిన ఘటనను రూరల్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తాండూరు రూరల్ సీఐ నగేష్, కరణ్ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ తలెఇపిన వివరాల ప్రకారం.. చంద్రవంచ గ్రామంలో ఈనెల 6న వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు.

ఉత్సవ కమిటి సభ్యులు వినాయక విగ్రహాలను ట్రాక్టర్లలో ఉంచి నిమజ్జనానికి తరలించారు. గ్రామంలోని ఈశ్వరుని గుడి సమీపంలోని రాగానే గ్రామానికి చెందిన ఇరువర్గాలకు చెందిన ట్రాక్టర్లు ఎదురుపడ్డాయి. ఇందులో ఓ వర్గం వారు తమకు దారి వదిలితే ముందుకు వెళతామని కోరారు. ఇందుకు మరో వర్గం వారు అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మద్య మాటా మాటా పెరిగింది. అక్కడు ఉన్న గ్రామ పెద్దలు ఇరువర్గాలను సముదాయించారు. మరుసటి రోజు ఆదివారం కూడా ఇరువర్గాల మద్య గొడవలు లేకుండా రాజీ కుదిర్చారు. అయితే సోమవారం రాత్రి ఇరువర్గాల మద్య మళ్లీ గొడవ మొదలైంది. అర్దరాత్రి వరకు అరుపులతో భయాందోళకు గురిచేశారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కరణ్ కోట్ పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేళ్లు బస్వరాజ్, శేఖర్‌లు విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లారు.

అప్పటికే ఇరువర్గాల దాడులకు యత్నించుకుంటున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ బస్వరాజ్ తలకు గాయాలయ్యాయి. ఇదే దాడిలో గ్రామానికి చెందిన దస్తప్ప, మరికొందరు గాయాలపాలయ్యారు. కానిస్టేబుల్‌తో పాటు బాధితులను 108 సాయంతో చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ బస్వరాజ్ తలకు గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. అదేవిధంగా దస్తప్ప అనే వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అయితే కుటుంబీకులు తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

సీసీ కెమరాలో రికార్డు అయిన ఘర్షణ
మరోవైపు సోమవారం అర్దరాత్రి గ్రామంలో జరిగిన ఘర్షణ వాతావరణం సీసీ కెమెరాలతో రికార్డు అయ్యింది. ఘర్షణకు ఆపేందుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లలలో శేఖర్ అనే కానిస్టేబుల్ కూడా ఘర్షణను వీడియో తీశారు. ఈ సంఘటనను తాండూరు రూరల్ సీఐ నగేష్ సీరియస్‌గా తీసుకున్నారు. సీఐ ఆదేశాలతో కరణ్ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ మంగళవారం చంద్రవంచ గ్రామాన్ని సందర్శించారు. ఘర్షణకు గల కారణాలు, కారుకుల గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఘర్షణ పడిన వారికి గుర్తించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్దరాత్రి ఘర్షణకు దిగిన ఇరువర్గాలలో సుమారు 15 నుంచి 20 మందిపై కేసులు చేసినట్లు రూరల్ సీఐ నగేష్ వెల్లడించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో కరణ్ కోట్ పోలీసులు మంగళవారం బందోబస్తు నిర్వహించారు.

ఇదికూడా చదవండి…

