ప్రజా సేవే ధ్యేయం..!
– మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దం
– కాంగ్రెస్ నాయకులు గౌరి రామలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సేవే చేయడమే తన ధ్యేయమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు తాండూరు కాంగ్రెస్ నాయకులు గౌరి రామలు అన్నారు.

తాండూరులో మన్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డులో నుంచి కౌన్సిలర్‌గా బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం దక్కితే తప్పకుండా పోటీ చేస్తానని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిల సహాకారంతో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.

ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజా సమస్యలపై పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని, అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అవకాశంను సద్వినియోగం చేసుకుని.. ప్రజా సేవ చేసి నిరూపించుకుంటానని అన్నారు.

ఇదికూడా చదవండి…

